చేయూత పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానం
అర్హులైన పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి వర్ధన్నపేట ప్రతినిధి, ఆగస్టు 9,తరంగాలు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకంలో భాగంగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో అర్హులైన పట్టణ ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కోరారు. కొత్తగా మంజూరు చేయనున్న పింఛన్లలో వితంతు పింఛన్, ఒంటరి మహిళా పింఛన్, వికలాంగుల పింఛన్, గీత కార్మికుల పింఛన్, చేనేత కార్మికుల పింఛన్, పైలేరియా పింఛన్, డయాలసిస్ పింఛన్ తదితర పింఛన్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన పట్టణ ప్రజలు తమ దరఖాస్తులను వర్ధన్నపేట మున్సిపల్...