గోదాముల నుంచి లక్కపురుగుల దండు..!!

లక్క పురుగుల బెడదతో పర్వతగిరి ఉక్కిరిబిక్కిరి..! అన్నంలో పురుగులు.. నిద్రలోనూ పురుగులే! హాస్టళ్లు,ఇళ్లలోకి చొరబడుతున్న లక్కపురుగులు విద్యార్థుల నరకయాతన విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమా..? గోదాముల నుంచి వస్తున్న పురుగులపై చర్యలేవీ? అధికారుల నిర్లక్ష్యంపై స్థానిక నాయకులు పిట్టల రాజు తీవ్ర ఆగ్రహం పర్వతగిరి, ఆగస్టు 9, తరంగాలు : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో లక్కపురుగుల ఉధృతి తీవ్రరూపం దాల్చింది. స్థానిక మార్కెట్ యార్డు బియ్యం గోదాము, కల్లెడ పీఏసీఎస్ మొక్కజొన్న గోదాముల నుంచి వస్తున్న పురుగులు ఇళ్లలోకి, హాస్టళ్లలోకి చేరుతుండటంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక నాయకులు పిట్టల రాజు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో వండిన అన్నంలోకి...