నర్సంపేటలో నిప్పులు చెరిగిన రాజకీయ వాతావరణం!
గద్దె కూల్చివేతతో బీఆర్ఎస్ గరం గరం! “విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గం.. కుట్ర వెనుక కాంగ్రెస్ నాయకులు” పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఎర్రబెల్లి ఫైర్ “ఎన్ని అడ్డంకులొచ్చినా విగ్రహం ఆవిష్కరించి తీరుతాం” — ఎర్రబెల్లి దయాకర్‌రావు నర్సంపేట, ఆగస్టు 10 (తరంగాలు ప్రతినిధి): దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడం నర్సంపేటలో రాజకీయ దుమారం రేపింది. గద్దె కూల్చివేత ప్రదేశాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం నర్సంపేట పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గపు...