వరంగల్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులును వేగవంతం చెయ్యాలి

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసి,కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ బీజేపీ బృందం! న్యూఢిల్లీ, ఆగస్టు 10,తరంగాలు :వరంగల్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులును వేగవంతం చెయ్యాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని తెలంగాణ బీజేపీ బృందం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.వరంగల్-మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక ఆమోదం తెలిపినందుకు గాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తో పాటు మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ ఆజ్మీరా సీతారామ్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు అదిలాబాద్ లోకసభ సభ్యులు గోడెం నగేష్,ప్రొఫెసర్ ఆజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మరియు బీజేపీ...