సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్ పెండింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేసిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య న్యూడిల్లి, ఆగస్టు 13,తరంగాలు : వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అనుమతులను త్వరితగతిన మంజూరు చేసి, మిగిలిన ప్రక్రియను పూర్తి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో గురువారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు.వరంగల్, పరిసర ప్రాంతాల్లో సుమారు 12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సీజీహెచ్‌ఎస్...