రాయపర్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అనుమానిత వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ రాయపర్తి, ఆగస్టు 16,తరంగాలు : రాయపర్తి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అనుమానిత వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ సూచించారు. గ్యాస్ ఈ-కేవైసీ, కొత్త గ్యాస్ కనెక్షన్లు, ఆధార్ ఈ-కేవైసీ, రేషన్ కార్డు ఈ-కేవైసీతో పాటు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఇంటి రుణాలు, పంట రుణాలు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు కొత్త వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతోందని తెలిపారు.కొత్త గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని, ఫోటో అప్లోడ్ చేయాలని చెబుతూ మహిళలు మెడలో ధరించిన బంగారు ఆభరణాలను పక్కన పెట్టాలని...