ఆసుపత్రిలో సేవలపై కలెక్టర్ ఆరా!
మందుల నిల్వలు, టీకాల పంపిణీ, సిబ్బంది హాజరుపై ఆకస్మిక తనిఖీ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం రాయపర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రాయపర్తి , ఆగస్టు 26, తరంగాలు : రాయపర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది పనితీరు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆమె పరిశీలించారు. పల్లె దవాఖానాలో చిన్నారులకు వ్యాధి నిరోధక...