రాఖీ పండుగ వేళ కన్నీటి జ్ఞాపకం
ఏడేళ్ల క్రితం దూరమైన అన్న చిత్రపటానికి రాఖీ కట్టి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న చెల్లెలు వర్ధన్నపేట ప్రతినిధి, ఆగస్టు 28,తరంగాలు : రాఖీ పౌర్ణమి పండుగ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అయితే కొందరి జీవితాల్లో ఆ పండుగ ఆనందంతో పాటు తీరని విషాదాన్ని కూడా మోసుకొస్తుంది. అలాంటి హృదయవిదారక దృశ్యమే ఇది.ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్ కుమారుడు గొడిశాల రామ్ సాయి మృతి చెందారు. అన్నను కోల్పోయిన బాధను గుండెల్లో దాచుకున్న ఆయన చెల్లెలు లక్ష్మీ గాయత్రి, ఈ రాఖీ పండుగ సందర్భంగా అన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ భావోద్వేగానికి...