కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి వర్ధన్నపేట బిజెపి మండల అధ్యక్షులు అడుప రాజు వరంగల్, (తరంగాలు ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, వారి విద్యను సంక్షోభంలోకి నెడుతోందని వర్ధన్నపేట బీజేపీ మండల అధ్యక్షులు అడుప రాజు విమర్శించారు. వరంగల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తో కలిసి బీజేపీ మండల అధ్యక్షులు అడుప రాజు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 1000 రోజులు పూర్తవుతున్నా ఇప్పటివరకు విద్యాశాఖకు పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం...