దాడులతో బీజేపీని భయపెట్టలేరు!

ప్రజల కోసం మా పోరాటం ఆగదు..అధికారం శాశ్వతం కాదు: సిరికొండ బలరాం బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ములుగు జిల్లా కేంద్రంలో భారీ నిరసన ములుగు ప్రతినిధి , సెప్టెంబర్ 1 (తరంగాలు): బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, దాడులకు పాల్పడిన వారిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. *ప్రజల తరఫున ప్రశ్నిస్తే దాడులా?* ఈ సందర్భంగా సిరికొండ బలరాం మాట్లాడుతూ.. విద్యార్థులు, రైతులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ...