ఉరి శిక్షే సరైన సమాధానం
అత్యాచారం,హత్యకు పాల్పడిన నిందితుడిని వదలొద్దు.. ఆదివాసి నర్సు శిరీష హత్యపై రాష్ట్ర పాలసీ రీసెర్చ్ కో-కన్వీనర్ గుగులోతు స్వరూప ఆగ్రహం ఆదివాసి బిడ్డ ప్రాణానికి విలువ లేదా? శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి మహిళల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి మహిళల భద్రత ఎక్కడ? శిరీష హత్యపై ప్రభుత్వాన్ని నిలదీసిన స్వరూప ములుగు ప్రతినిధి, సెప్టెంబర్ 03,తరంగాలు : ఆదివాసి, గిరిజన నర్సింగ్ విద్యార్థిని ఊకె శిరీషపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా కఠినంగా శిక్షించాలని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర పాలసీ రీసెర్చ్ కో-కన్వీనర్ గుగులోతు స్వరూప డిమాండ్ చేశారు. శిరీష హత్య ఘటన అత్యంత దారుణమని,...