విద్యార్థులకు పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించాలి

సాయిపేట పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి హనుమకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 4, తరంగాలు: ధర్మసాగర్ మండలం సాయిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి గురువారం ప్రారంభించారు. ముందుగా ఉన్నత పాఠశాలలో, అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఇడ్లీ, సాంబార్‌తో కూడిన అల్పాహారాన్ని కలెక్టర్ స్వయంగా అందించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను ప్రధానోపాధ్యాయులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) మెటీరియల్ అందుబాటులో ఉందా, రెమెడియల్ తరగతులు నిర్వహిస్తున్నారా అని ప్రధానోపాధ్యాయుడు బాపురావును అడిగి తెలుసుకున్నారు....