ఒక్కరోజు ఉపాధ్యాయురాలిగా కలెక్టర్ సత్య శారద

విద్యార్థినులతో మమేకమైన కలెక్టర్ కలెక్టర్ చేతిలో చాక్‌పీస్.. తరగతి గదిలో సందడి! లోహిత పాఠశాలలో విద్యార్థినులకు స్వయంగా పాఠాలు చెప్పిన సత్య శారద వరంగల్ ప్రతినిధి , సెప్టెంబర్ 3, తరంగాలు: వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక్కరోజు ఉపాధ్యాయురాలిగా మారారు. దింతో తరగతి గదిలో సందడి నెలకొంది. విద్యార్థుల అభ్యాస స్థాయిని తెలుసుకోవడంతో పాటు వారిలో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం సంగెం మండలం లోహిత గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ఆత్మీయంగా మమేకమైన కలెక్టర్.. ఒక్కరోజు ఉపాధ్యాయురాలిగా మారి స్వయంగా తరగతి గదిలో పాఠాలు బోధించారు....