ప్రతీ పేదవాడి చెంతకు సంక్షేమ పథకాలు

స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలకు మరింత భరోసా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు వర్ధన్నపేటలో సంక్షేమ సంబరాలు.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వర్ధన్నపేట ప్రతినిధి , తరంగాలు: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడి చెంతకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలకు మరింత భరోసా అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేటలోని ఎంఎంఆర్ గార్డెన్స్‌లో తహసిల్దార్ విజయసాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి...