కొండా సురేఖ కీలక నిర్ణయంపై ఉత్కంఠ
- "నిరీక్షణ ముగిసింది" అంటూ సోషల్ మీడియాలో సంకేతం - రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన సుస్మిత - కొండా కుటుంబం తదుపరి అడుగుపై రాజకీయ వర్గాల్లో చర్చ హైదరాబాద్, సెప్టెంబర్ 4, (తరంగాలు ప్రతినిధి ): మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత మాజీ మంత్రి కొండా సురేఖ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. త్వరలోనే ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తా" అంటూ ఆమె చేసిన పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆమె తీసుకోబోయే నిర్ణయం ఏమిటన్న దానిపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ...