యువతను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌: చల్లా ధర్మారెడ్డి

కాంగ్రెస్‌ 1000 రోజుల దగా పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట పరకాలలో అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు భారీ ర్యాలీ అంబేద్కర్ సెంటర్లో ధర్నా..పోలీసుల అత్యుత్సాహంతో తోపులాట విద్యార్థులను అడ్డుకున్న పోలీసుల తీరుపై చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం పరకాల ప్రతినిధి, సెప్టెంబర్ 5,తరంగాలు : ఎన్నికల ముందు యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేసిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి యువత తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా...