ఎమ్మెల్సీ తాతా మధుపై నిమ్మని శేఖర్ రావు ఫిర్యాదు
స్పీకర్ గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు సరికాదు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హన్మకొండ సుబేదారి పోలీసులకు పిర్యాదు హన్మకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 7,తరంగాలు :ప్రజాప్రతినిధులపై వ్యక్తిగత, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు అన్నారు. సోమవారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు సోమవారం హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో...