దళిత స్పీకర్ పై బీ.ఆర్.ఎస్ అహంకారం తగదు
వర్ధన్నపేట నియోజకవర్గం యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుల్ల యాకాంతం వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 8,తరంగాలు గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్వీకరణ ఉద్దేశించి బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు మరియు అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని వర్ధన్నపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుల్ల యాకాంతం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కుల్ల యాకాంతం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ స్థానానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని,అలాంటిది ఒక దళిత వర్గానికి చెందిన స్పీకర్ను పట్టుకొని అంతటి అసభ్య పదజాలంతో దూషించడం బీఆర్ఎస్ పార్టీ యొక్క అహంకారానికి, దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం అని మండిపడ్డారు. పదవుల...