వైన్స్‌ షాపే బెల్ట్‌ షాపుల అడ్డా!

రాయపర్తిలో చక్రం తిప్పుతున్న సిండికేట్ దందా ఎమ్మార్పీకి తూట్లు.. మద్యం వ్యాపారుల దోపిడీ మద్యం వ్యాపారులదే ఆట.. పాడిందే పాట మద్యం మాఫియా ముందు అధికార యంత్రాంగం మౌనం మామూళ్లు ఇస్తున్నాం... మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు పల్లె పల్లెకూ మద్యం సరఫరా.. మౌనంగా సంబంధిత అధికారులు? ఉన్నతాధికారులు ఇకనైనా కఠిన చర్యలు తీసుకుంటారా? లేక మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యమే కొనసాగుతుందా? రాయపర్తి, సెప్టెంబర్ 9 (తరంగాలు ప్రతినిధి ): రాయపర్తి మండలంలో మద్యం విక్రయాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌ షాపుల నుంచి బెల్ట్‌ షాపులకు పెద్దఎత్తున మద్యం తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మారుమూల పల్లెల్లో సైతం విచ్చలవిడిగా మద్యం విక్రయాలు...