రీ సర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలి

చెన్నారం గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అదనపు కలెక్టర్ వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 10,తరంగాలు : వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. కిషోర్ కుమార్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ సర్వేలో భాగంగా చేపడుతున్న సర్వే ప్రక్రియ, భూముల హద్దుల నిర్ధారణ, భూ వివరాల నమోదు తదితర అంశాలను ఆయన పరిశీలించారు.గ్రామంలో రీ సర్వే పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, ఇంకా చేపట్టాల్సిన పనులు ఏమిటి అనే అంశాలపై సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో భూముల వాస్తవ పరిస్థితులను పరిశీలించి, అందుబాటులో ఉన్న భూ రికార్డులతో వివరాలను...