చౌరస్తాలు చెరువులాయె.. రోడ్లు గుంతలమయమాయె!
చినుకు పడితే చిత్తడే.. హనుమకొండపై పాలకుల నిర్లక్ష్యం! మాటలు కోటలు దాటుతున్నాయ్.. చేతలు మాత్రం శూన్యం: రావు పద్మారెడ్డి హనుమకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 14,తరంగాలు : చిన్నపాటి వర్షానికే హనుమకొండ నగరం అతలాకుతలం అవుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థి రావు పద్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రధాన చౌరస్తాలు, రహదారులు అధ్వాన్నంగా మారాయని, వర్షం పడితే రోడ్లన్నీ జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ? హనుమకొండ నగరంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు, ఉన్న డ్రైనేజీలకు సకాలంలో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో వర్షపు...