అర్ధరాత్రి ఆపన్నహస్తం.. డెంగ్యూ బాధిత బాలుడికి ఎమ్మెల్యే భరోసా

సోషల్‌ మీడియా పోస్టులు చూసి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు రాత్రి 10:50 గంటలకు స్వయంగా ఫోన్‌.. చికిత్సకు అండగా ఉంటామని హామీ వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 16,తరంగాలు : ఆపదలో ఉన్న ఓ కుటుంబానికి అర్ధరాత్రి వేళ ఎమ్మెల్యే స్వయంగా ఫోన్‌ చేసి భరోసా కల్పించారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన 11 ఏళ్ల మంద కార్తీక్‌ కొన్నిరోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ అత్యవసర చికిత్స పొందుతున్నాడు. చికిత్స ఖర్చులను భరించేందుకు కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థిక సహాయం కోరుతూ సోషల్‌ మీడియా, వాట్సాప్‌ ద్వారా చేసిన విజ్ఞప్తులు ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు దృష్టికి వెళ్లాయి.విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.....