చెరువు భూమి 100 గజాలైన ఆక్రమించారా..?
ఆక్రమణ నిరూపిస్తే..దేనికైనా సిద్ధం మాటలతో కాదు.. రికార్డులతో తెల్చుకుందాం.. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు "ఓపెన్ ఛాలెంజ్ " నిమ్మని శేఖర్‌రావు భూమిపై ఆరోపణలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘాటు స్పందన అధికారిక రికార్డులు, సర్వేలతో వాస్తవాలు తేల్చుకోవాలని స్పష్టం వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 16,తరంగాలు :ఓ టీవీ ఇంటర్వ్యూలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు విసిరిన సవాల్‌తో వర్ధన్నపేట నియోజకవర్గం లో హాట్‌టాపిక్ గా మారింది.ప్రముఖ న్యాయవాది నిమ్మని శేఖర్‌రావుకు చెందిన మామిడి తోట భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు,విమర్శలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీవ్రంగా స్పందించారు. భూమి వ్యవహారంలో వాస్తవాలను అధికారిక రికార్డులు, రెవెన్యూ పత్రాలు, సర్వేల ఆధారంగా తేల్చుకోవాలని ఆయన...