నేనున్నాను.. భయపడొద్దు..!
అర్ధరాత్రి ఫోన్‌తో భరోసా.. ఉదయానికే ఆసుపత్రికి ఎమ్మెల్యే నాగరాజు పరామర్శ కాదు.. బాధ్యత! ఆదిత్య చికిత్సకు రూ.55 వేల సాయం.. ఎల్‌ఓసీ కోసం సీఎంతో మాట్లాడుతానని హామీ ఆదిత్య కుటుంబానికి కొండంత అండ వైద్యులతో గంటసేపు మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. మెరుగైన వైద్యం అందించాలని సూచన వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 17,తరంగాలు : ప్రజాప్రతినిధి అంటే కేవలం పరామర్శించి వెళ్లిపోవడం కాదు.. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీటిని తుడిచి, అవసరమైన సమయంలో అండగా నిలబడటమే నిజమైన నాయకత్వం. ఈ మాటకు కార్యరూపం చూపించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన 11 ఏళ్ల...