వినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు కలగాలి: ఎస్సై సాయిబాబు

అజాద్ హింద్ ఫౌజ్ యూత్ ఆధ్వర్యంలో భక్తి పరవశంలో సామూహిక కుంకుమ పూజ గణనాథుడిని దర్శించుకున్న ఎస్సై.. యూత్ సభ్యులకు టీషర్ట్ల పంపిణీ గణనాథుని నామస్మరణతో మార్మోగిన ఉత్సవ ప్రాంగణం వర్ధన్నపేట ప్రతినిధి,సెప్టెంబర్ 18,తరంగాలు : వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరికి సుఖసంతోషాలు కలగాలని వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు ఆకాంక్షించారు.గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని అజాద్ హింద్ ఫౌజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజ భక్తి పరవశాన్ని నింపింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఉత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు హాజరై గణనాథుడిని దర్శించుకుని...