వాహనాల బ్యాటరీల దొంగకు చెక్
16 బ్యాటరీలు స్వాధీనం.. రూ.లక్ష విలువైన సొత్తు రికవరీ ఐదు కేసులను ఛేదించిన కాకతీయ యూనివర్సిటీ పోలీసులు హనుమకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 19,తరంగాలు : రాత్రివేళల్లో రోడ్లపై పార్కింగ్ చేసిన ట్రాక్టర్లు, లారీల బ్యాటరీలను అపహరిస్తున్న నిందితుడిని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేసి, రూ.లక్ష విలువైన 16 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ బాలసముద్రానికి చెందిన పస్తం అయిలు కుమార్ (35) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతంలో కూడా ఇతనిపై పలు దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 2012లో వరంగల్...