భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అత్యవసర సమాచారం కోసం కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయండి కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్: 18004253424, 9154252936 వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 23 (తరంగాలు): వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగులు, నాలాలు, కాలువల సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వర్షాల కారణంగా నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నందున వాగులు, కాలువలు,...