భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు
వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్.. విద్యార్థుల భద్రత దృష్ట్యా కలెక్టర్ నిర్ణయం వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 23, తరంగాలు: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించినందున విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని, వర్షాలు, వరదలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్...