సీసీ కెమెరాలతో గ్రామాలకు భద్రతా కవచం..!
జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ జఫర్‌ఘడ్ , సెప్టెంబర్ 25 (తరంగాలు ప్రతినిధి ): నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. శుక్రవారం జఫర్‌ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 14 గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ నరసయ్య, జఫర్‌ఘడ్ ఎస్‌ఐ రామారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సుప్రో ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ నిధులతో, ఆయా గ్రామాల సర్పంచుల సహకారంతో సుమారు రూ.25 లక్షల వ్యయంతో మండలంలోని ప్రధాన కూడళ్లలో మొత్తం 75 వైఫై...