రక్తదానం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ప్రాణాలను నిలబెట్టే మహా సేవ.. రక్తదానం యువత రక్తదానానికి ముందుకు రావాలి బిజెపి ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కొర్ర సుమలత బీజేవైఎం ఆధ్వర్యంలో ములుగులో సేవా సంకల్ప్ అభియాన్‌లో మహా రక్తదాన శిబిరం ములుగు, సెప్టెంబర్ 26 (తరంగాలు):రక్తదానం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, మనమిచ్చే రక్తం మరొక కుటుంబానికి వెలుగునిస్తుందని,యువత రక్తదానానికి ముందుకు రావాలని బిజెపి ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కొర్ర సుమలత పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా సేవా ప్రస్థానంతో పాటు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నెలరోజుల పాటు నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శనివారం ములుగు...