ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి
బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్,రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు,బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 27,తరంగాలు : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు, వెనుకబడిన వర్గాల ఆత్మబంధువు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు బిజెపి ఓబీసీ మోర్చా వరంగల్ జిల్లా అధ్యక్షులు కూచన క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో కొత్తవాడ జంక్షన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, బిజెపి రాష్ట్ర నాయకులు...