కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

తెలంగాణ సాధన, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం: జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 27,తరంగాలు :కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వరంగల్ గోపాలస్వామి గుడి జంక్షన్‌లోని ఆయన విగ్రహానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మన్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్...