వయోవృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

ఏనుగల్లు గ్రామ సర్పంచ్ తొర్రి పద్మ యాదవ్ పర్వతగిరి, సెప్టెంబర్ 29 (తరంగాలు ప్రతినిధి ):వయోవృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఏనుగల్లు గ్రామ సర్పంచ్ తొర్రి పద్మ యాదవ్ అన్నారు.పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తొర్రి పద్మ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వయోవృద్ధులు కుటుంబానికి, సమాజానికి విలువైన మార్గదర్శకులని, వారి అనుభవాలు భావితరాలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ఆప్యాయత, గౌరవంతో వ్యవహరించడంతో పాటు వారి ఆరోగ్యం, భద్రత, అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన బాధ్యత...