రైతులకు సేవలందించడమే పీఏసీఎస్‌ల లక్ష్యం కావాలి

నూతన పాలకవర్గం రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు — నూతన చైర్మన్‌ పింగళి వెంకటరెడ్డికి ఘన సన్మానం హసన్‌పర్తి, సెప్టెంబర్‌ 30 (తరంగాలు): రైతులకు సేవలందించడమే పీఏసీఎస్‌ల లక్ష్యం కావాలని,నూతన పాలకవర్గం రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు.హసన్‌పర్తి పీఏసీఎస్‌ సర్వసభ్య సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కేఆర్‌ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్‌ చైర్మన్‌ పింగళి వెంకటరెడ్డితో పాటు నూతన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌...