వైద్యం అనేది వ్యాపారం కాదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత

ప్రజారోగ్య సమస్యలపై రౌండ్‌టేబుల్‌ సమావేశం అక్టోబర్‌ 6న కరీంనగర్‌లో నిర్వహణ- పోస్టర్‌ ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత కరీంనగర్,అక్టోబర్ 1 (తరంగాలు ప్రతినిధి ): కరీంనగర్ జిల్లాలో ప్రజారోగ్య రంగంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో అక్టోబర్‌ 6న రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. అత్యవసర...