మంచి మిత్రుడిని కోల్పోవడం బాధాకరం
టెన్నిస్ కోర్టులో మొదలైన స్నేహం.. ఆత్మీయ బంధంగా మారింది డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంతాపం వరంగల్ ప్రతినిధి, అక్టోబర్ 1 (తరంగాలు): సుబేదారి ఆఫీసర్స్ క్లబ్ సభ్యుడు, తనతో కలిసి టెన్నిస్ ఆడే ఆత్మీయ మిత్రుడు డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతదేహాన్ని గురువారం ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు...