అక్రమ స్కానింగ్ కేంద్రాలపై ఉక్కుపాదం!
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు.. పోర్టబుల్ స్కానింగ్ మిషన్లు సీజ్ నెక్కొండ, కాశీబుగ్గలో ఆకస్మిక తనిఖీలు.. పలువురిపై కేసులు నమోదు వరంగల్ ప్రతినిధి, అక్టోబర్ 3 (తరంగాలు): అనుమతులు లేకుండా స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తూ గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణకు పాల్పడుతున్న వారిపై వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి ఆదేశాల మేరకు నెక్కొండ, కాశీబుగ్గ ప్రాంతాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అక్రమంగా నిర్వహిస్తున్న స్కానింగ్ కేంద్రాలను గుర్తించి పోర్టబుల్ స్కానింగ్ మిషన్లను సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై పీసీపీఎన్డిటీ చట్టం-1994 కింద...