ఎమ్మెల్యే నాగరాజుపై తప్పుడు ప్రచారం సహించేది లేదు
ఎన్‌టీవీ యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకుంటే ఎన్‌టీవీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఐనవోలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నకరకంటి మోహన్‌గౌడ్ ఐనవోలు , అక్టోబర్ 3 (): వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజుపై తప్పుడు ఆరోపణలు, నిరాధార వార్తలను ప్రచారం చేస్తే సహించేది లేదని ఐనవోలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నకరకంటి మోహన్‌గౌడ్ హెచ్చరించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి వర్ధన్నపేట నియోజకవర్గాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న నాగరాజుకు ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక కొందరు ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల పారదర్శకంగా జరిగిన పీఏసీఎస్ వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్ల...