గుంతతో పొంచి ఉన్న ప్రమాదం
అధికారులు స్పందించాలి లీకేజీతో ప్రధాన రహదారి దెబ్బతిని వాహనదారులకు తప్పని ఇబ్బందులు: గోపాలపురం కంటెస్టెడ్ కార్పొరేటర్ రావుల వెంకట రమేష్ గౌడ్ హన్మకొండ ప్రతినిధి , అక్టోబర్ 4 (తరంగాలు): గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపురం పరిధిలోని వడ్డేపల్లి చర్చి నుంచి ఫిల్టర్‌బెడ్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై పూరిగుట్ట మూల మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉందని గోపాలపురం కంటెస్టెడ్ కార్పొరేటర్ రావుల వెంకట రమేష్ గౌడ్ తెలిపారు.మున్సిపల్ గేట్‌వాల్ లీకేజీ కారణంగా రోడ్డుపై నీరు చేరి పెద్ద గుంత ఏర్పడటంతో రహదారి ప్రమాదకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మూల మలుపు వద్ద గుంత ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం, గుంతను...