అంగన్‌వాడీల సేవలు అభినందనీయం.. శిల్పారెడ్డి
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మడికొండలో ‘అంగన్ మిలన్ సేవా’.. మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సత్కారం వరంగల్ ప్రతినిధి, అక్టోబర్ 06 (తరంగాలు): అంగన్‌వాడీ సిబ్బంది చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా మడికొండ డివిజన్‌లో నిర్వహించిన ‘అంగన్ మిలన్ సేవా’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండ డివిజన్‌లో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శైలశ్రీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట...