ఘనంగా ఎమ్మెల్యే మురళీనాయక్ జన్మదిన వేడుకలు
400 మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులతో అంబేద్కర్ సెంటర్లో సందడి.. ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,చిలువేరు సమ్మయ్య గౌడ్ కేసముద్రం, అక్టోబర్ 06 (తరంగాలు): మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ జన్మదిన వేడుకలు కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ (సమ్మి గౌడ్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. *సమ్మి గౌడ్ పిలుపుతో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు* సమ్మి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి...