క్రీడాల్లో మెరిసిన పల్లవి హైస్కూల్ విద్యార్థినులు

రాష్ట్రస్థాయి క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధం నెట్‌బాల్,సాఫ్ట్‌బాల్ పోటీలకు అన్నారం పల్లవి హైస్కూల్ విద్యార్థినుల ఎంపిక జోనల్,జిల్లా స్థాయిల్లో అద్భుత ప్రతిభతో రాష్ట్రస్థాయికి ఐదుగురు విద్యార్థినుల ఎంపిక రాష్ట్రస్థాయిలో పతకాలే లక్ష్యం - పాఠశాల యాజమాన్యం పర్వతగిరి , అక్టోబర్ 08,(తరంగాలు ప్రతినిధి): వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని పల్లవి హైస్కూల్ విద్యార్థినులు క్రీడల్లో తమ ప్రతిభను చాటుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. జోనల్, జిల్లా స్థాయిల్లో నిర్వహించిన నెట్‌బాల్, సాఫ్ట్‌బాల్ పోటీల్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి ఐదుగురు విద్యార్థినులు రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థినులు క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం పట్ల...