ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు చొరవతో "ఒక్కటైన ప్రేమజంట"
ఇరువర్గాల కుటుంబాలతో చర్చలు.. వివాహానికి ఒప్పించిన ఎమ్మెల్యే నాలుగు రోజుల శ్రీదేవి దీక్షకు తెర.. శ్రీకాంత్ కుటుంబం అంగీకారం ప్రేమ వివాహం చేసుకున్న ఎమ్మెల్యే.. ప్రేమికుల పక్షాన నిలిచిన నాయకుడు నూతన వధూవరులకు నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే నాగరాజు-మల్లీశ్వరి దంపతులు వర్ధన్నపేట ప్రతినిధి, అక్టోబర్ 08, (తరంగాలు) ప్రియుడు శ్రీకాంత్‌తో వివాహం జరిపించాలని కోరుతూ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న దళిత యువతి శ్రీదేవి ఆందోళనకు ఎట్టకేలకు ముగింపు లభించింది. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు ప్రత్యేక చొరవతో శ్రీకాంత్, ఆయన కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించారు. ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు ఆధ్వర్యంలో ఇరువర్గాల కుటుంబ సభ్యులతో...