రైతు ప్రభుత్వం కాదు.. రాబందుల ప్రభుత్వం!
కాంగ్రెస్ తుగ్లక్ పాలనలోనే రైతులకు కరెంట్ కష్టాలు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం నరసయ్య,బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ధ్వజం. బీజేపీ రైతు ధర్నా.. నాయకుల అరెస్టులు పోలీసుల అడ్డగింతతో ఉద్రిక్తత వరంగల్ ప్రతినిధి, అక్టోబర్ 09,తరంగాలు : అధికారంలోకి వస్తే రైతులకు స్వర్గధామం చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు అన్నదాతలను నట్టేట ముంచిందని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం నరసయ్య, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, అనాలోచిత విధానాల వల్లే నేడు రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రోగ్రాం కన్వీనర్ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు...