ఆడపడుచుల ఆనందమే బతుకమ్మ పండుగ పరమార్థం!
ఆడపడుచుల జీవితాల్లో ఆనందాల పూలవాన కురవాలి! వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక ఆడపడుచులందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోవాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట ప్రతినిధి, అక్టోబర్ 10,తరంగాలు : తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఆత్మగౌరవానికి, ప్రకృతితో మమేకమైన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకాంక్షించారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మకు ప్రత్యేకమైన స్థానం ఉందని, రంగురంగుల పూలతో బతుకమ్మలను...