గ్రానైట్స్ కంపెనీల ఇష్టారాజ్యం.. అధికారుల మౌనం!
జాతీయ రహదారి పక్కనే గుంతలు.. రోడ్డుపై బండరాళ్లు! గ్రామపంచాయతీ పాలకవర్గం,అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలకు ఆహ్వానం.. ప్రజల ప్రాణాలకు రక్షణ ఏది? వెంకటేశ్వర,అరుణ గ్రానైట్స్ కంపెనీలపై చర్యలు తీసుకునేదెవరు? ఉన్నతాధికారులు స్పందించాలని ప్రయాణికులు,స్థానికుల డిమాండ్ ఐనవోలు, అక్టోబర్ 10,తరంగాలు : ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు మౌనం వహిస్తే.. నిబంధనలు పాటించాల్సిన సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో హనుమకొండ జిల్లా అయినవోలు మండలం పంతిని గ్రామంలో కనిపిస్తున్న దృశ్యాలే నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వెంకటేశ్వర, అరుణ గ్రానైట్స్ కంపెనీల సమీపంలో పెద్దపెద్ద గుంతలు, రోడ్డుపక్కనే పేరుకుపోయిన బండరాళ్లు వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆరోపిస్తున్నారు....