ఎమ్మెల్సీ బరిలో బీసీ అస్త్రం?
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల పోరులో కమలం వ్యూహం!ఏమిటి..? బీసీ అస్త్రమా.. ఆచితూచి అడుగులా? కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రవర్ణ అభ్యర్థులతో మారిన రాజకీయ సమీకరణాలు బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ.. రేసులో డాక్టర్ వన్నాల వెంకటరమణ పేరు ముందంజలో! హైదరాబాద్, అక్టోబర్ 16 (తరంగాలు ప్రతినిధి ): వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కమలం పార్టీ వ్యూహం ఏమిటి? అభ్యర్థి ప్రకటనలో జాప్యం వెనుక ఆచితూచి అడుగులా.. లేక అంతర్గత కసరత్తులో భాగమా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే ప్రధాన చర్చ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సన్నాహాల్లో ముందుకు సాగుతుండగా, బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపికపై స్పష్టత ఇవ్వకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది....