ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి డయల్-112 కాల్స్‌పై తక్షణ స్పందన తప్పనిసరి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత రాయపర్తి, అక్టోబర్ 29, (తరంగాలు ప్రతినిధి):పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని,ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, వెస్ట్ జోన్ పరిధిలోని రాయపర్తి పోలీస్ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ రికార్డులు,...