ఓటు చోరీపై ఢిల్లీకి యువజన కాంగ్రెస్ దండయాత్ర!
నవంబర్ 1న రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీ ▪ కేఆర్ దిలీప్ రాజ్ ఆధ్వర్యంలో వరంగల్ యువజన కాంగ్రెస్ శ్రేణుల పయనం ▪ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతల స్పష్టీకరణ వరంగల్, అక్టోబర్ 31, (తరంగాలు ప్రతినిధి): ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా వరంగల్ అర్బన్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరాయి. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. *ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం* ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్...