బస్తాపై 26 కిలోలు.. తూకంలో 25 కిలోలే!

26 కిలోల బస్తాలో కిలో బియ్యం మాయం! క్వింటాకు నాలుగు కిలోల టోఖరా తూకంలో ఇంత మోసమా..? తూనికల శాఖ ఉగ్రరూపం! ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనల ఉల్లంఘనపై వ్యాపారులపై 10 కేసులు విక్రయదారులకు అధికారుల స్ట్రాంగ్ వార్నింగ్! ● వినియోగదారులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు ● ప్రకటించిన బరువుకే సరుకులు విక్రయించాలి వరంగల్ జిల్లా తూనికలు,కొలతల శాఖ అధికారి కూచన మనోహర్ వరంగల్, అక్టోబర్ 31 (తరంగాలు ప్రతినిధి): తూకంలో మోసాలకు పాల్పడుతున్నారా? వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నారా? ఇకపై అలాంటి వ్యవహారాలు సాగవు! బియ్యం, కిరాణా దుకాణాల్లో తక్కువ తూకంతో సరుకులు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా తూనికలు,...